చిన్న తాండపాడు గ్రామంలో ఆశీర్వాద సభ విందు.
జోగులాంబ గద్వాల 3ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- అలంపూర్. నియోజకవర్గంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో ఆశీర్వాద విందు ఏర్పాటు చేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డా.యస్.ఏ సంపత్ కుమార్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్ధనలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ ప్రార్ధన అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డెప్ప, వైస్ చైర్మెన్ పచర్ల కుమార్, మాజీ సింగల్ విండో అధ్యక్షులు సంకపురం రాముడు,అయిజ మండల అధ్యక్షుడు k జయన్న చిన్నతాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరి సుధాకర్ గౌడ్, కౌన్సిలర్లు సులోచనమ్మ, మద్దిలేటి, మైనర్ బాబు,అలాగే సీనియర్ లీడర్ గిత్తల దేవరాజు, దేవేందర్, రవీందర్ సూర్యచంద్ర కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు.