పెద్ద ధన్వాడ గ్రామానికి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలి.  

రాజోలి మండలం బి ఆర్ ఎస్ పార్టి అధ్యక్షులు పచ్చర్ల శ్రీనివాస్.

Apr 4, 2026 - 20:40
Apr 4, 2026 - 20:41
 0  1
పెద్ద ధన్వాడ గ్రామానికి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలి.  
పెద్ద ధన్వాడ గ్రామానికి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలి.  

జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- రాజోలి. మండలం పెద్ద ధన్వాడ గ్రామ విద్యార్తులు పెద్ద ధన్వాడ నుండి చిన్న తాండ్రపాడు గ్రామానికి  గత కొన్ని సంవత్సరాలనుండి గ్రామానికి బస్ రానందున ఎర్రటి ఎండలో  ప్రతి రోజు 7 కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్ళ వలసిన పరిస్థితి  ఉంది అది కూడ కొందరు విద్యార్థిని, విద్యార్థులు కాళ్లకు కనీసం చెప్పులు లేకుండా స్కూల్ కి నడుచుకుంటూ వెళుతున్నారు. ఎలక్షన్ల ముందు మాత్రమే ఇలాంటి సమస్యలను అధికారం లోకి వచ్చిన వెంటనే  పరిష్కారం చేస్తామని చెప్పి అధికారం చేపట్టాక ఇలాంటి కనీస అవసరాలను కూడ ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయి. అభివృద్ధి దేవుడెరుగు. పెద్ద ధన్వాడ గ్రామానికి  కనీసం  బస్సు లేక రోడ్డు లేక   అత్యవసర సమయాలలో ఇప్పటికే  ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరో విద్యార్థులు చదువులు మానేశారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికి బస్సు సౌకర్యం లేని ఇలాంటి గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీని పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టి RTC అధికారుల తో మాట్లాడి రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి వెంటనే ieeja నుండి బస్సు సౌకర్యం కల్పించడానికి తగిన ఏర్పాటు చేయాలని విన్నమించు కుంటున్నాము. అలాగే  ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామానికి పూర్తి స్థాయి లో రోడ్డు వేయడానికి తోడ్పాటు అందించి పెద్ద ధన్వాడ గ్రామానికి  కనీసం రాక పోకల కోసం వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State