తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
తిరుమలగిరి 24 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బాల్తా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తల్లితండ్రుల -అధ్యాపకుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంచార్జి ప్రిన్సిపాల్ బాల్తా శ్రీనివాస్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి సరి అయిన ప్రణాళికతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలని అదేవిధంగా పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా, ఎక్సర్సైజ్ చేయాలని మంచి ఫలితాలు సాధించి కళాశాలకు మంచి పేరు తేవాలని కోరారు అలాగే సీనియర్ తెలుగు అధ్యాపకులు గుండగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు రాబట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు వారి తల్లి తండ్రులు పాల్గొన్నారు.