తరచూ ప్రమాదాలకు చెక్ పెడుతున్న జగ్గయ్యపేట ""ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : తరచూ ప్రమాదాలకు చెక్ పెడుతున్న జగ్గయ్యపేట ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు జగ్గయ్యపేట మండలంలోని పోచంపల్లి గ్రామానికి వెళ్లడానికి ఇటీవల నూతనంగా తారు రోడ్డు వేయటం జరిగినది .
ఆ గ్రామానికి మరియు ఆయా పరిసర గ్రామాలకి వెళ్లేవారు కొందరు కొంగర మల్లయ్య గట్టు సమీపంలో సాయిబాబా గుడి వద్ద నుండి క్రాసింగ్ అవతల పక్కకు ఆపోజిట్ గా వెళ్తుండటం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నవి .
ఇప్పటికే నాలుగైదు యాక్సిడెంట్లు జరిగినవి .అయినా ఆ గ్రామాలకు వెళ్లేవారు ఆపోజిట్ గా వెళ్ళటం వలన పలు ప్రమాదాలు జరుగుతున్నవి .అంతేకాకుండా కనీసం డేంజర్ లైట్లు గాని సిగ్నల్ లైట్లు వేయకుండా అతివేగంగా వెళ్ళటం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నవి . టూ వీలర్స్ కాకుండా ట్రాక్టర్లు, కార్లు కూడా ఆ మార్గాన పోవడం కోసం మెరుపు.
అందులో భాగంగా బుధవారం జగ్గయ్యపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు గారు మరియు మొబైల్ సిబ్బంది సంయుక్త నేతృత్వంలో అక్కడ ఎవరైతే ఆపోజిట్ గా వస్తున్నారో ఆ వాహనాలను ఆపి వారిపై జరిమానా విధిస్తున్నారు. ఇది నిత్యం కొనసాగాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకున్నటువంటి ఈ చర్యలపై పలు ఒక్కరు సహకరించాలని జగ్గయ్యపేట ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు గారు వాహనదారులను కోరుతున్నారు.