తండ్రి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.బుడిగే లింగయ్య

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగే లింగయ్య తన తండ్రిగారైన క్రీస్తు శేషులు బుడిగే భద్రయ్య జ్ఞాపకార్ధంగా గత సంవత్సరం 10వ తరగతిలో మెరిట్ సాధించిన వారికి మొదటి బహుమతిగా 5116 ,రెండో బహుమతిగా 3116 మూడవ బహుమతిగా 2116 లను అందజేయడం జరిగింది.