హయత్ నగర్లో శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ పెయింట్ వరల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Aug 15, 2025 - 18:28
Aug 15, 2025 - 19:07
 0  10
హయత్ నగర్లో శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ పెయింట్ వరల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్;15 ఆగస్టు2025 శుక్రవారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీనగర్ నియోజకవర్గం,హయత్ నగర్ నేతాజీ నగర్ కాలనీ, నీలాద్రి హాస్పిటల్ పక్కన నిర్వాహకులు మధుసూదన్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ పెయింట్ గ్యాలరీ ఓపస్ బిర్లా పెయింట్స్ కి ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులు మధుసూదన్ గౌడ్ తో కలిసి ఘనంగా ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇంద్రధనస్సులో కలల లాగా తమ పెయింటింగ్ వ్యాపారం విజయవంతంగా సాగాలని కోరారు. నాణ్యమైన ప్రామాణికమైన వస్తువులను కస్టమర్లకు అందించాలని తెలిపారు. ఆర్థికంగా ఎదుగుతూ నలుగురికి ఉపాధి కలిగించే దిశగా తమ వ్యాపారాన్ని దినదినాభివృద్ధిగా కొనసాగించాలని తెలిపారు. స్వయం శక్తితో ఎదగాలని తపన ఉన్న ప్రతి ఒక్కరికి తమ అండ ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. అనంతరం నిర్వాహకులు మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ..ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి సాలువతో సన్మానించారు. నాణ్యమైన ప్రామాణికమైన వస్తువులను కస్టమర్లకు అందించి వారి మన్నలను పొందుతామని నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. తమ వద్ద అన్ని షాపులలో కంటే తక్కువ ధరలో పెయింటింగ్స్ లభిస్తాయని తెలిపారు. కాలనీవాసులు, ప్రజలు తమ బిర్లా ఒపస్ పెయింట్స్ ని సందర్శించి కొనుగోలు చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో పలు కాలనీల పెయింటర్స్,కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.