డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన

మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు

Nov 26, 2024 - 19:58
 0  10
డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలంలోని తుంగతుర్తి  గ్రామానికి చెందిన సుంచు కావేరి భర్త  నరసింహ అనే డ్రైవర్   గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో ఈరోజు వారి కుటుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన డ్రైవర్ ప్రమాద భీమా నుండి మంజూరు అయిన ₹5,00,000/- (ఐదు లక్షల) రూపాయల చెక్కును తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులకు అందజేసారు

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ కార్మిక సంక్షేమం కోసం డ్రైవర్ల కోసం తెలంగాణ రాష్ట్ర  తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రోడ్డు ప్రమాదాల వల్ల గాని, వాటర్లో మునిగిగాని, కరెంటు షాకు తో గాని  అకస్మికంగా మరణిస్తే   ప్రతి డ్రైవర్, జర్నలిస్ట్, హోంగార్డ్  సోదరునికి  ఈ భీమా  వర్తించేలా కృషి చేసి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక వేసులు బాటు కల్పించారు ఈ  ఎంతో మంది డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల వలన  ప్రాణాలు కోల్పోతున్నారు, తద్వారా వారి కుటుంబాలు రోడ్ మీద  పడుతున్నాయి.. వారు బతికి ఉన్న కాలంలో కూడా జీవిత భీమా కట్టుకోలేని పరిస్థితి వారిది.అలాంటి వారికి  మన కెసిఆర్ గారు డ్రైవర్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని 2015లో వారికి 5 లక్షల ప్రమాద భీమా అమలుజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాజీ రాజ్యసభ సభ్యులు BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్  మాజీ జడ్పీటీసీ దావుల. వీరాప్రసాద్ BRSKV నియోజకవర్గం ఇంచార్జి గౌడిచర్లu సత్యనారాయణ, BRSKV తుంగతుర్తి నాయకులు గడ్డం సోమేశ్ మల్లేపాక రాములు బత్తుల సాయిలు యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333