బస్సు డిపో ఏర్పాటు కై సబ్బండ కులాల దీక్షను జయప్రదం చేయండి

తిరుమలగిరి 03 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బస్సు డిపో ఏర్పాటుకై సుబ్బండ కులాల దీక్షను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య మాట్లాడుతు. తిరుమలగిరి వ్యాపార పరంగా దినదినము అభివృద్ధి చెందుతూ తిరుమలగిరిలో ఆర్టీసీ డిపో నిర్మాణం చేసినట్లయితే ప్రజా ప్రయోజనాల దృశ్య అదేవిధంగా ఆర్టీసీకి ఆదాయం పెరిగే అవకాశాలు కూడా తిరుమలగిరిలో ఉన్నవి అందుకోసం తిరుమలగిరిలో డిపో ఏర్పాటు చేయాలని తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజలంతా డిపో నిర్మాణం కోసం ఆదివారం రోజున జరిగే దీక్షలో పాల్గొని విజయంతో చేయాలని కోరడమైనది.. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ గఫార్ SK పాషా, చిలకల రమేష్, కొండ సోమయ్య, పాలాభిందెల సుభాష్,. యాదగిరి, గంట లక్ష్మణ్, . శ్రీను, . బిక్షం, . బుచ్చిబాబు, . యాదగిరి, . నాగరాజు, శ్రీను, . కొమరయ్య, . లింగయ్య, శంకర్ సేటు, . రాములు, . సోమేశ్ తదితరులు పాల్గొన్నారు....