పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ పోరాట దినోత్సవం

Mar 9, 2024 - 20:14
 0  5
పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ పోరాట దినోత్సవం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  మహిళలు చదువుకుంటే సమాజాన్ని మార్చుకుంటం. పూలన్ TPTF జిల్లా ఉపాధ్యక్షులు సమాజంలో మహిళలు చదువుకుంటే వారి కుటుంబ మార్పుతో పాటు వ్యవస్థను మార్చగల శక్తి సామర్ధ్యాలు ఉంటాయని TPTF జిల్లా ఉపాధ్యక్షులు పూలన్ అన్నారు. పాత సూర్యాపేట గ్రామంలో ప్రగతిశీల మహిళ సంఘం (పి వో డబ్ల్యు) అధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా సభ సామ ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూలన్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ప్రకటించి నేటికీ 114 సంవత్సరాలు అయింది. మహిళల పై సాగుతున్న శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగా, మెరుగైన పరిస్థితుల కోసం, కనీస సౌకర్యాల కోసం, మీటింగ్ పెట్టుకునే హక్కు కోసం, పురుషుల తో సమానం యూనియన్లో తమకి కూడా భాగస్వామ్యం కల్పించాలని, ఓటు హక్కు కావాలని నినదిస్తూ మహిళా కార్మికులు మహత్తర పోరాటాలు చేశారు. అంతే కాకుండా అంతర్జాతీయ మహిళా దినం అంటే సంబరాలు, ఉత్సవాలు జరుపుకోవడం కాదని ముగ్గుల పోటీలు అంత కంటే కాదు, మార్చి 8 అంటే మహిళల ధిక్కార పతాకం అని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితో మహిళల పై తరుగుతున్న దాడులు,హింస,అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమం లో POW జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ,అంగన్ వాడి టీచర్ సైదమ్మ,TPTF జిల్లా నాయకులు శుభాన్, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సామ నర్సిరెడ్డి,రేణుక,శైలజ,మమత,పున్నమ్మ,లక్ష్మమ్మ,పద్మ,హైమవతి,లీలావతి తదితరులు పాల్గోన్నారు.*