* డ్రైడే చేయడం వలన కీటక జనత వ్యాధులను నియంత్రించవచ్చు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ కే సిద్దప్ప

Aug 1, 2025 - 19:47
 0  3
* డ్రైడే చేయడం వలన కీటక జనత వ్యాధులను నియంత్రించవచ్చు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ కే సిద్దప్ప
* డ్రైడే చేయడం వలన కీటక జనత వ్యాధులను నియంత్రించవచ్చు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ కే సిద్దప్ప

. ప్రాథమిక ఉపకేంద్రం జమ్మిచేడు ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్వో.

.. పలు రికార్డులు, మందుల పరిశీలన, సూచనలు సలహాలు.

 జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పేరు  పరిధిలో ఉన్న జమ్మిచేడు సబ్ సెంటర్ ను ఈరోజు డిఎంహెచ్ఓ సందర్శించారు.. శుక్రవారం కాబట్టి సిబ్బంది చేపట్టిన ట్రైడే రిపోర్టులను అడిగి తెలుసుకున్నారు... ప్రతి శుక్రవారం విధిగా ఫ్రైడే నిర్వహించాలని... గ్రామ ప్రజలకు హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలని, చికెన్ గునియా డెంగు మలేరియా వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు....

.ముఖ్యంగా పట్టణ ప్రాంతం మరియు గ్రామాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి జ్వరాలు డయేరియా వంటివి రాకుండగా చూసుకోవాలని సందర్భంగా  పది రకాలుగా పాటించవలసిన నియమాలను తెలిపారు...

ప్రతి శుక్రవారం "డ్రై డే"గా పాటించండి – ఇంటి లోపల, బయట నిలువ నీరు లేకుండా చూడండి.

✅  జిల్లా ప్రజలు పాటించవలసిన ముఖ్య సూచనలు:

1️⃣ ఇంట్లో నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. 
2️⃣ పాత టైర్లు, కొబ్బరిచిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కప్పులు, టీ కప్పులు తొలగించాలి.    3️⃣ వారానికి ఒకసారి నీటి డబ్బాలు, డ్రములు శుభ్రపరచాలి. 
4️⃣ కూలర్లు, ఫ్రిజ్, A.C లలో నీరు నిల్వ కాకుండా పరిశుభ్రంగా ఉంచాలి. 
5️⃣ కిటికీలు, డోర్లకు దోమల జాలీలు అమర్చుకోవాలి.
 6️⃣ పరిసరాల్లో నీటి గుంతలు పూడ్చాలి. పెద్ద నీటి నిల్వల్లో ఇంజనాయిల్/ఆయిల్ బాల్స్ వేయాలి. 
7️⃣ డోర్లు, వాష్‌రూమ్స్ మూలల్లో "హిట్ బ్లాక్" స్ప్రే వాడాలి. 
8️⃣ పిల్లలు మరియు పెద్దలు ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించాలి. 
9️⃣ మస్కిటో రిపెలెంట్లు వాడాలి (కోయిల్స్, లిక్విడ్స్, క్రీములు).
10. ప్రతి గ్రామం లో ప్రతి రోజు Fever survey ANM's మరియు  Asha's చేయవలెను. Supervisors మానిటర్ చేయవలెను. అట్టి రిపోర్ట్ ను జిల్లా కు పంపవలెను
.. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కృష్ణవేణి, ఆరోగ్య విస్తరణ అధికారి రవిచందర్, ఎన్సీడీ జిల్లా సమన్వయ కార్యకర్త శ్యాంసుందర్, ఏఎన్ఎం శోభారాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు...

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333