డ్రగ్స్ నియంత్రణ బైక్ యాత్ర ప్రభుత్వ టీచర్ రాచకొండ ప్రభాకర్
అడ్డగూడూరు 26 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులకు,యువతకు వివిధ గ్రామాల ప్రజలకు డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమం స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న తెలుగు పండిట్ రాచకొండ ప్రభాకర్ డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దోమపానాలకు డ్రగ్స్, గంజాయి,వంటి వాటికి ఎవరు ఆకర్షణ కావద్దని తెలిపారు.విద్యార్థుల అలవాట్లపై తల్లిదండ్రులు ఒక నిఘ వేసి ఉండాలని అన్నారు.ఈ రోజుల్లో విద్యార్థులు మత్తు పాన్యాలకు ఆకర్షణకు అలవాటు పడుతున్నారని అన్నారు.ఈ బైకు యాత్ర తెలంగాణ అంతట ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ఉన్న రోజులలో అన్ని జిల్లాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.డ్రగ్స్ నియంత్రణ చేయడం కోసం కృషి చేస్తానని రాచకొండ ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు ఇంటి గ్రామాల ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.