డిసెంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు

జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 66 వైఫల్యాలపై డిసెంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని డికె. బంగ్లాలలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హయారయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫలాలు చార్జిషీట్ తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.2వ తేదీన గద్వాల నియోజకవర్గంలో బైక్ ర్యాలీ,3వ తేది అల్లంపూర్ నియోజకవర్గం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. 4వ తేదీన జిల్లా లో అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగాడుతూ చార్జిషీట్ నమోదు చేయాలని అన్నారు. 5 వ తేదీన అల్లంపూర్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఉంటుందని, డిసెంబర్ 7 వ తేదీన గద్వాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ విద్యా సాగర్ రావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లు డికె .స్నిగ్దా రెడ్డి, రవి కుమార్ ఎక్బోటే,రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి,అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివా రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు kk. రెడ్డి, అసెంబ్లీ మాజీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్, బిజెపి సీనియర్ నాయకులు నాగేశ్వర రెడ్డిరాజశేఖర్ శర్మ, మధుసూదన్ రావ్, నాగ మల్లయ్య తదితరులు ఉన్నారు..