డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగుచేయాలి.

Aug 23, 2024 - 17:53
Aug 23, 2024 - 17:54
 0  40
డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగుచేయాలి.
డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగుచేయాలి.

 రైతులు అందరికి రుణమాఫీ చేస్తాం 

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

  నాగారం ఆగస్టు 23 తెలంగాణ వార్త

ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. ఆయిల్ పామ్ మేఘ ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా మండల పరిధిలో నీ ఫణిగిరి గ్రామం లో కమటం జయమ్మ పిలిప్స్ 
 నూతనంగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంను అయన ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు..ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు.  ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇవ్వబడును. గరిష్టంగా ఒక రైతుకు 12:50 ఎకరాల వరకు డ్రిప్పు రాయితీ  వర్తిస్తుందనీ 
 నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన  ఆయిల్  పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా  ప్రస్తుతం మార్కెట్లో బాగా  డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న
ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు  దరఖాస్తు చేయలని కోరారు..
అందరికి రుణమాఫీ చేస్తాం
రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్య పడవద్దని మండలంలోని వ్యవసాయ అధికారులకు  వ్యవసాయ విస్తరణ అధికారులకు రుణమాఫీ కానీ వారు వివరాలు ఇచ్చినట్లు అయితే వాటిని పరిష్కారం చేస్తామన్నారు. రెండు లక్షలు పైన ఋణం ఉన్న రైతులు బ్యాంకు వారికీ మీరు కట్టాల్సిన ఋణం చెల్లించినట్లు అయితే ప్రభుత్వం చేయాల్సిన రెండు లక్షలు మాఫీ అవుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో  ప్రాంతీయ ఉద్యాన అధికారులు ఎం మహేష్, ప్రమిత , మండల వ్యవసాయ అధికారి  కృష్ణకాంత్, ఆయిల్ సీడ్స్  ఆఫీసర్ శ్రీకాంత్,పతంజలి ఆయిల్ పామ్  డి జి ఎం బి యాదగిరి, మేనేజర్ హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్,క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు, భద్రాచలం,కరుణాకర్ రైతులు రవీందర్, అశోక్ రెడ్డి, మల్యాల అశోక్, జలెండర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333