నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. 

Jul 6, 2024 - 19:37
 0  4
నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. 

హైదరాబాద్: జులై 06: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన సమావేశం ఈరోజు జరగనుంది.  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను స్నేహపూరిత వాతావర ణంలో పరిష్కరించుకు నేందుకు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. 

హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమం త్రులు సమావేశం అవు తారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృ తంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. 

మరోవైపు భద్రాచలాన్ని ఆనుకొన్ని ఐదు గ్రామపంచా యతీల విలీనం అంశం కూడా సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దు బాటు అంశంతోపాటు పౌర సరఫరాలశాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు తెలిసింది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333