డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కు అభినందనలు తెలిపిన బిసి సంఘ నాయకులు

ఉప్పల్ 30 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
హైదరాబాదులో ఉంటూ సంక్రాతి పండుగకు సొంతఊరికి బయలుదేరగా పండుగ రోజు ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)మండల పరిధిలోని ఏపూర్ గ్రామానికి చెందిన మధుసూదన్ కు భుజంకు,కుడి చేయి రెక్కకుతీవ్ర గాయాలు కాగా ఎల్ బి నగర్ రాక్ టౌన్ కాలనీ పవన్ సాయి హాస్పిటల్ లో చేర్పించగా గ్రామాల ప్రజలు పేద ప్రజలు అని మనసులో దయాగుణంతో తక్కువ ఖర్చుతో రెండు సర్జరీలు చేసి గురువారం రోజు డిశ్చార్జ్ చేస్తున్న పేదల పెన్నిధి ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు దేవుడు రూపంలో పేద ప్రజలకు సేవ అందిస్తున్న డాక్టర్"అలేటి శ్రీనివాస్ గౌడ్ కి అభినందనలు తెలిపిన బిసి సంఘ రాష్ట్ర యువ నాయకులు వీరబోయిన వీరన్న,రావుల సంజీవ,కోడూరు ఉప్పలయ్య,కొరివి మహేష్,ఈర్ల శ్రీనివాస్,అవిరె మధుసూదన్,కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.