జోగులాంబ గద్వాల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బాలికల స్కూల్. (బిజ్వారం) పరమాల స్టేజి
- క్లాస్ వైస్ గా వాట్సాప్ గ్రూపులు పెట్టడం లేదు
- ఇతర హాస్టల్లో వాట్సాప్ గ్రూపులు పెట్టినారు ఇక్కడ ఎందుకు పెట్టడం లేదు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
- మా పిల్లలు చదువుతున్నారా లేదా అని మేము ఎవరిని అడగాలి
- ఇవన్నీ అడగాలంటే ప్రిన్సిపాల్ తో మేము సమావేశమైనప్పుడు క్లాస్ టీచర్ల ద్వరా ఆడడం ఉంటుది
- ప్రిన్సిపాల్ ఏ తల్లిదండ్రులతో కూడా స్పష్టంగా మాట్లాడినటువంటి దాఖలు లేవు
విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన.
జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పరమాల స్టేజి దగ్గర, మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల స్కూల్ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చూడడానికి వస్తే ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రిన్సిపల్ మరియు స్కూల్ సిబ్బంది,ఎర్రటి ఎండలో నిలబెట్టి మీ పిల్లలకి ఎలాంటి అనుమతి లేదు అని నిర్లక్ష్యం చేస్తున్న తల్లిదండ్రులు పిల్లల కోసం వస్తే కొంచెం కూడా కనికరం లేకుండా నిలబెట్టడం జరిగింది మరియు అంత మాత్రమే కాకుండా మేము చెప్పినప్పుడే రావాలి? ఎప్పుడు పడితే అప్పుడు వస్తే మేము బయటికి పంపాము అసలు చూపియ్య కూడా చూపియ్యం అని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది.ఇది విన్న తల్లిదండ్రులు మేము మా పనులు వదిలిపెట్టుకొని మా పిల్లలను చూడడానికి వస్తే చూడడానికి పిలవరా మా పిల్లలకి ఏమైనా అయ్యిందంటే అప్పుడు చెప్తాను మీ కథ అంటూ ఆవేదన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఈ హాస్టల్లో ప్రిన్సిపాల్ మరియు టీచర్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూనారు,కాబట్టి ప్రిన్సిపాల్ మీద వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి,అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.