జూలై 3న సేయింట్ థామస్ హతసాక్షి డే 

Jul 3, 2025 - 19:35
 0  0
జూలై 3న సేయింట్ థామస్ హతసాక్షి డే 

    నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవం
            బిషప్ దుర్గం ప్రభాకర్
     తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు
                                                                        జూలై 3 గురువారం: సూర్యాపేట పట్టణ కేంద్రం స్థానిక 5వ వార్డు నందు తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు, బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ తన నివాసంలో ఘనంగా జూలై 3న " సేయింట్ థామస్ హతసాక్షి దినోత్సవం" సందర్బంగా దేశ ప్రజలకు భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీ. శ. యేసు క్రీస్తు శిష్యులు అయినా 12 మంది లో ఒకరైన అపో. సేయింట్ థామస్ యేసు క్రీస్తూ డొక్కలో మరియు తన చేతి గాయములలో వ్రేలు పెట్టి చూసి నమ్మిన వాడు, క్రీ.శ 52లో భారత దేశంలోని కేరళ రాష్టంలోకి సువార్త నిమిత్తం వచ్చి అక్కడ నుండి తమిళనాడు కు సువార్త ను ప్రకటించి అనేకులను క్రీస్తూ లోని నడిపించారు, పరంగిమలై భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలోని ఒక చిన్న కొండ, గిండికి సమీపంలో మరియు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా సమీపంలో ఉందనీ. భారతదేశంలోని పురాతన సిరియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ వారి చర్చి యొక్క మూలాన్ని సెయింట్ థామస్ ది అపోస్టల్‌ గా గుర్తించారనీ.సేయింట్ థామస్ 20 సంవత్సరాలు సువార్త ను ప్రకటించి క్రీ.శ 72లో మైలాపూర్ లో హతసాక్షిగా హత్యకు గురయ్యారని ఆయన మరణించిన దినం ప్రతి యేటా జూలై 3న పండుగగా జరపుకుంటరని అన్నారు.భారత దేశానికి సువార్త ఇంగ్లిష్ వారి ద్వారా రాలేదని, ఇజ్రాయెల్ నుండి వచ్చిందని గుర్తు చేస్తూ అది మాత్రమే కాకా వస్కోడీ గామా అమెరికా నుండి సముద్ర మార్గాన్ని మన దేశానికి కనిపెట్టకముందే భారతదేశం లో క్రైస్తవులు వున్నారని, ఇంకా బైబిల్ లోని పాత నిబంధనలోని పరో కాలం నానీ సమాజ మందిరం "చిన గోగు " కేరళ లోని కొచ్చి లో ఉందని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333