జానకిపురం గ్రామంలో రేషన్ సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

Apr 7, 2025 - 21:35
Apr 7, 2025 - 21:36
 0  78
జానకిపురం గ్రామంలో రేషన్ సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

అడ్డగూడూరు 07 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణలోని నిరుపేద వాళ్లు కడుపు నింపుకోవడమే కాదు..సంపన్నులు తినే సన్నబియ్యం తింటూన్నారని మందుల సామేలు అన్నారు.సోమవారం తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామంలో బహుజన కుటుంబానికి చెందిన అంబటి రాంబాబు-ప్రమీల ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో  వడ్డించిన భోజనాన్ని ఎమ్మెల్యే సామేల్ వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.భోజనం చేస్తుండగా సామేలుకు అక్కడ ఉన్న ప్రజలు ముచ్చట్లు చెప్పుతూ..గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం అందించడంతో సరైన తిండి తినక పోతుంటిమని,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడంతో కడుపునిండా తింటున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ..సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సామేలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు సింగల్ విండో చైర్మన్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,మోత్కూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాశం సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాలెంల సైదులుమార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలెంల విధ్యసాగర్ చిత్తలూరు సోమన్న,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కేసారపు శ్రీనివాస్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు సమ్మయ్య,మండల అధికారులు ఎంపీడీవో శంకరయ్య అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.