జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్‌–యూజీ-2025’ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు

May 4, 2025 - 20:12
 0  11
జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్‌–యూజీ-2025’ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు

*3 కేంద్రంలో నీట్ పరీక్ష నిర్వహణ *

 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్,ఎస్పి

నీట్ పరీక్షకు 1,005 మంది హాజరు

జోగులాంబ గద్వాల 4 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల,ప్రభుత్వ బాలికల పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ బి.యం.సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


    ఈ సందర్భంగా కలెక్టర్ నీట్ పరీక్ష నిర్వహణ విధానం,విద్యార్థుల హాజరు వివరాలను అధికారుల నుండి తెలుసుకున్నారు.పరీక్ష నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు.పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లను అనుమతించరాదని అన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాల‌ని అధికారులకు సూచించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో మొత్తం 1,029 మందిలో 1,005 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు,24 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో 03 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష శాంతియుత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించబడిందని కలెక్టర్ వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వెంకటేష్,ప్రిన్సిపాల్స్,సంబంధిత అధికారులు,తదితరులు, పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333