జాతీయ యువ నాయకత్వ వర్క్‌షాప్‌కు ఎల్మకంటి సందీప్ ఎంపిక
పాలకుర్తి 26 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువ చైతన్య యూత్ ప్రధాన కార్యదర్శి ఎల్మ కంటి సందీప్ జాతీయ స్థాయి టిబి & డా"టిబి యువ నాయకత్వ వర్క్‌షాప్ కు ఎంపికయ్యారు.యువతలో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించి,టిబి నిర్మూలనలో వారి పాత్రను బలపరచడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించబడుతోంది.ఈ కార్యక్రమం మార్చి 27–28, 2026 తేదీలలో న్యూ ఢిల్లీలోని జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంస్థ (ఎన్ హెచ్ ఎఫ్ డబ్ల్యూ)లో జరుగనుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 80 మంది యువ నాయకులు ఇందులో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ఎలమకంటి సందీప్ మాట్లాడుతూ..జాతీయ స్థాయి వేదికపై పాల్గొనే అవకాశం రావడం గర్వకారణమని తెలిపారు.తనను ఎంపిక చేసిన నిర్వాహకులకు మరియు ఈ అవకాశాన్ని కల్పించిన మేరా యువ భారత్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.