బెక్కేశ్వరం ఆలయంలో 47 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం
26-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెఖ్యం గ్రామంలో విద్యార్థులు. 47 ఏళ్ళ తరవాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెం గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు 47 ఏళ్ల అనంతరం ఆత్మీయంగా కలుసుకుని తమ పాఠశాల జ్ఞాపకాలను స్మరించుకున్నారు. 1979–1980 బ్యాచ్‌కు చెందిన ఈ విద్యార్థులు బుధవారం బెక్కేశ్వరం జడ్పిహెచ్‌ఎస్‌లో గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నలుమూలలలో వివిధ రంగాలలో ఉన్నత స్థాయిల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకుని, తమ బాల్య స్మృతులను పంచుకున్నారు. చదువుకున్న క్లాస్‌రూమ్‌లను సందర్శించి, గురువులను గుర్తుచేసుకుంటూ మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చాలా కాలం తర్వాత స్నేహితులను కలుసుకోవడంతో అందరి ముఖాల్లో ఆనందం పొంగిపొర్లింది.అంతేకాక, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంతో తమ పాత గ్రామం నీటిలో కలిసిపోయినప్పటికీ, అక్కడి జ్ఞాపకాలు మాత్రం హృదయాల్లో చెరగని ముద్రగా మిగిలాయని వారు పేర్కొన్నారు. ఆ జ్ఞాపకాలను స్మరించుకుంటూ బెక్కేశ్వరం శివాలయంలో ప్రత్యేకంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ మధ్య స్నేహబంధాన్ని మరింత బలపరచుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం అందరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించింది.
ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా స్నేహితులు వనజా రెడ్డి, ఇంద్రారెడ్డి, జీ పార్వతమ్మ, విజయలక్ష్మి, నిర్మల, విజయమ్మ, రాణి, లక్ష్మి, ఉమా, శ్రీదేవి, మంగమ్మ, వరమ్మ, రాజేశ్వరి, శోభ, అమృత, ఉషారాణి, గీత, శాంతా రెడ్డి, సిపిట, పద్మ, నాగలక్ష్మి, పద్మ, నాగమణి, వెంకటరమణమ్మ,, లక్ష్మీ దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.