చెప్పిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి
30-12-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి ఎలక్షన్లలో ప్రజలకు ఇచ్చిన మాటలో భాగంగా తన సొంత ఖర్చుతో స్మశాన వాటికలో ఈరోజు బోర్ వేయించడం జరిగింది.
గ్రామస్తులు అధిక సంఖ్యలో కొత్త వెంకట్ రెడ్డికి బోర్ వేయించినందుకు అభినందనల వర్షం కురిపించారు. సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్లో నేను ఇచ్చిన మాటలను ఒకదాని తర్వాత ఒకటి కచ్చితంగా నెరవేరుస్తాను గ్రామ అభివృద్ధి నా లక్ష్యం, 24 గంటలు పని చేస్తూనే ఉంటాను అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్త వెంకట్ రెడ్డి తో పాటు, తోట బాలకృష్ణ, సింగోటం బాలస్వామి, నాలుగో వార్డ్ నెంబర్ వెంకటస్వామి, ఐదవ వార్డ్ నెంబర్ గొందిపర్ల బాలకృష్ణ, బత్తుల నారాయణ, బిచ్చన్న, షేర్ పల్లి వెంకటస్వామి,మేకల గోపాల్, చిన్న మౌని దుబ్బన్న, శేఖర్, కురుమయ్య, ఉప్పరి భాస్కర్, గొందిపర్ల శివుడు, కుక్కన్న, పెద్ద నాగ చేసి తదితరులు పాల్గొన్నారు.