చిన్నంబావి మండల కార్యాలయానికి రెండు లక్షల S D F నిధులు మంజూరు చేసిన జూపల్లి

19-10-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల కార్యాలయానికి రెండు లక్షల SDF నిధులు మంజూరు చేసిన మంత్రి జూపల్లి.
కుర్చీలు లేక మండల స్థాయి సిబ్బంది నేలపై కూర్చుని సమావేశం నిర్వహించుకున్నారు. అన్న వార్తకు స్పందించిన రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఎస్డిఎఫ్ విధులనుంచి రెండు లక్షల రూపాయలను మంజూరు చేశారు.
2018 సంవత్సరంలో మల్టీపర్పస్ బిల్డింగ్ మూడు కోట్ల రూపాయలతో ఆనాటి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు మంజూరు చేయించారు. గత ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణం నోచుకోక కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం వాస్తవము.
నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేటి ప్రభుత్వం పై నిందలు మేపచూడడం సరైన విషయం కాదని తెలియపరుస్తూ... మౌలిక సౌకర్యాల విషయాలు తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి కృష్ణారావు గారు స్పెషల్ డెవలప్మెంట్ పండ్ ను రెండు లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేయడం జరిగింది.
శాశ్వత నిర్మాణాల కోసం తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా తెలియజేశారు.