కిరాణా షాపులో చోరీ
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- కిరాణా షాపులో చోరీ. ఆత్మకూర్ ఎస్ సూర్యాపేట. కిరాణా షాపు లో జొరబడి పదివేల నగదు మూడు మద్యం బాటిల్లు చోరీ చేసిన సంఘటన మండల పరిధిలోని కోటి నాయక్ తండాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్ బావ సింగ్ తండాకు చెందిన జాటోత్ జ్యోతి కోటి నాయక్ తండ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో కిరాణా షాపు నిర్వహిస్తుంది శుక్రవారం సాయంత్రం 8 గంటల సమయంలో షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళింది శనివారం ఉదయం షాప్ తెరవడానికి రాగా షట్టర్ వంకర పోయి ఉండి సామాన్లన్నీ చిందర తొందరగా పడి ఉన్నాయి దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు మూడు మద్యం బాటిళ్లు చోరికి గురయ్యాయి. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రత్నావత్ శంకర్ నాయక్ తెలిపారు.