చాగాపురం గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మార్వోను ఎంపీడీవోను కలిసిన ఉపసర్పంచ్ మరియు కాంగ్రెస్. నాయకులు
జోగులాంబ గద్వాల 2జనవరి 2026తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. ఎమ్మార్వో కార్యాలయం నందు చాగాపురం ఉప సర్పంచ్ మరియు సర్పంచ్ భర్త పరిసరాముడు కాంగ్రెస్ నాయకులు ఎమ్మార్వో నీ కలిసి ఎమ్మార్వోను శాలువాతో సన్మానం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవోను కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధి కొరకై సహకరించాలని అధికారులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరశురాముడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అల్లా బకాస్ చాగాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాంద్ బాషా మాజీ ఎంపీటీసీ చెన్నుపాటి రాముడు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.