చాగాపురం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట
జోగులాంబ గద్వాల 11 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల మండలం చాగాపురంగ్రామంలో 1,2,3 4 అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అంగనవాడి టీచర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ హాజరయ్యారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,,, మూడేండ్లకు పైబడిన చిన్నారులందరినీ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. గోడలపై రంగురంగుల అందమైన చిత్రాలు ఆకట్టుకునే ఆట బొమ్మలతో అంగన్‌వాడీ కేంద్రాలు ప్లేస్కూళ్లను తలపిస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆటాపాటలతో చదువు కూడా అందుతున్నది. ప్రైవేటు, కార్పొరేట్ ప్లేస్కూళ్లలో నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కల్పించే సౌకర్యాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సమకూర్చుతున్నది. దీంతో చిన్నారులు ఆడుతూపాడుతూ చదువుకుంటున్నారు గ్రామ ప్రజలు టీచర్లకు సహకరించి ప్రతి ఒక్కరు మీ పిల్లలను అంగన్వాడి స్కూల్ లోకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ అంగన్వాడి టీచర్లు ఆయాలు గర్భిణీ బాలింతలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సాతర్ల గ్రామంలో అంగన్వాడికేంద్రం 1 నందు అమ్మ మాట అంగన్వాడి బడిబాట కార్యక్రమం అంగన్వాడీ టీచర్ బియ్యమ్మ ఘనంగా నిర్వహించారు.