చలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

Jan 7, 2026 - 22:02
 0  131
చలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

తిరుమలగిరి 08 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో చలో ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమ కళాకారులకు 33 జిల్లాల కళాకారులను ఏకం చేసి తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలను సాధించుకునే దిశగా అడుగులు వేయాలని అందరూ కదిలి రావాలని కోరుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని మా చదువులు వదిలేసి ఉద్యమానికి పూర్తి సమయం ఇచ్చి మా ఆటపాట ధూమ్ దాంతో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమం వైపు మళ్ళించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందు వరుసలో నిలిచిన పాత్ర కళాకారులది. నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ పాటలతో ప్రజలను మమేకం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి అని ఎన్నో కలలు కన్నా మేము ఎన్నో కష్టాలు కన్నీళ్లతో బతుకు జీవనాన్ని కొనసాగించాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపిఆర్ఓ గారి నేతృత్వంలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం మన తెలంగాణకు సంబంధించిన పది జిల్లాల్లో సుమారు 3000 మంది కళాకారులకు ఉపాధి కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ప్రభుత్వంలో మూడు వేల మందికి కలిగే ఉపాధిని తీసివేసి తెలంగాణ సాంస్కృతిక సారధిని ఏర్పాటు చేసి కేవలం 550 మందికి ఆనాటి చైర్మన్ రసమయి బాలకిషన్ వారికి అనుకూలంగా ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ అన్యాయం పైన ప్రశ్నిస్తే కేసులు పెడుతూ భయభ్రాంతులను గురిచేస్తూ ఉద్యోగాలు ఇస్తామని మోసపూరితమైన మాయపూరితమైన మాటలు చెప్పి మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ మోసం చేయడం జరిగింది. సారధిలో ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తూ 12 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతూ ఉపాధి లేక ఉద్యోగం లేక కనీసం ఇల్లు లేని నిరుపేద కళాకారులం  గత ప్రభుత్వ పెద్దలు చుట్టూ తిరిగి తిరిగి అసహనానికి గురై ఎన్నో సందర్భాలు ఎంతో మంది కళాకారులు చనిపోతున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సారథ్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని గాంధీభవన్లో కలిసి మేము పడుతున్న బాధలు మా పేద కళాకారుల బతుకుతున్న గోస వివరించగా విని చలించి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చి మా విషయాన్ని 2023 ఎన్నికల మేనిఫెస్టోలో 96వ పేజీలో దాన్ని పెట్టించి మా మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు అదే స్ఫూర్తితో మా ఆటపాటలతో ప్రజలతో మమేకమై గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దింపడం జరిగింది మన కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ప్రతి ఒక్క జిల్లాలో పాట ద్వారా ఆట ద్వారా ప్రజాపాలనకు పట్టం కట్టడం జరిగింది ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో కొలువుతీరినారు. ప్రజా పాలన సంవత్సరం కాలంలోనే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతానికి అదైనటువంటి గౌరవం ఇచ్చి అందెశ్రీ గారిని గౌరవించడం సత్కరించడం చాలా సంతోషకరం.... పాటను గౌరవించిన ముఖ్యమంత్రి గారు మరి అదే విధంగా అర్హులైనటువంటి కవులు కళాకారులను కూడా గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి కళాకారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ   పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగింది అని వారు కూడా శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది దీని విషయమై జూపల్లి కృష్ణారావు గారికి కూడా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శాసనమండలిలో ప్రొఫెసర్ కోదండరాం సార్, మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అలాగే అసెంబ్లీలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ కళాకారుల విషయం మాట్లాడడం ప్రస్తావించడం కూడా జరిగింది. అసెంబ్లీలో శాసనమండలిలో పలుమార్లు ప్రస్తావించిన కళాకారుల ఎడల రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తూ గడుపుతున్నారు. తప్ప కళాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక సారధిలో 1000 ఉద్యోగాలు ఇవ్వాలని ఇందిరాపార్కు వేదికగా మిమ్మల్ని కోరుతున్నాం. చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గిలకత్తుల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఛలో ఇందిరపార్క్ కళాకారుల పోరు దీక్ష పోస్టర్ విడుదల  ముఖ్య అతిధులు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరాల యాదగిరి సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్ , సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లన్న , బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు , జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి బ్రహ్మం , తిరుమలగిరి పట్టణ అధ్యక్షులు ముద్దంగుల యాదగిరి , యాకన్న ముదిరాజ్ , తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి