చర్లపల్లి జైలు నుండి పోలీసు ఎస్కార్ట్ ద్వారా తండ్రి అంతక్రియలకు ఏర్పాటు

Aug 27, 2025 - 08:18
Aug 27, 2025 - 08:19
 0  8

*చర్లపల్లి జైలు నుండి పోలీసు ఎస్కార్ట్ ద్వారా తండ్రి అంతక్రియలకు ఏర్పాటు* అడ్డగూడూరు 26 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఆజింపేట గ్రామంలో 2017కేస్ క్రింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మొత్తం వ్యక్తులు 17 మంది ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు కేస్ నెంబర్ 76/2017లో పండుగ పెద్ద పిచ్చయ్య కుమారులు శ్రీను,లింగయ్య, మల్లయ్య జైలు శిక్ష పడి శిక్ష అనుభవిస్తున్నారు.తండ్రి మల్లయ్య అనారోగ్యంతో మంగళవారం మృతి చెందడంతో ధన సంస్కారాలకు కుమారులను చర్లపల్లి జైలు నుండి పోలీస్ ఎస్కార్ట్ ద్వారా తన గ్రామమైన ఆజీంపేటకు తీసుకురావడం జరిగింది. దానస్కంస్కారాలు తర్వాత మళ్లీ పోలీస్ ఎస్కార్ట్ ద్వారా చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందని ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.