చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి బుర్ర శ్రీనివాస్ గౌడ్

అడ్డగూడూరు 05 జనవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
చట్ట సభలలో బీసీ లకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీ రిజర్వేషన్ సాధన సమితి సబ్- కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆదివారం నాడు స్థానిక నాయకులతో కలిసి అడ్డగూడూరు మండల కేంద్రంలో శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్య 77 సం.. దాటినా బీసీలు ఇంకా పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నయవంచన, దోపిడీకి గురవుతున్నారని..ఇంకా 27 కులాలు సంచారజాతులుగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రానున్న స్థానిక, మున్సిపల్ లో జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి తమ సత్తా చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి తుప్పతి బీరప్ప, జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య మండల ఇంచార్జి పూజారి సైదులు బాలెంల మల్లయ్య, పనికేర సత్యనారాయణ, తుప్పతి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.