ఘోర రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ మృతి

Nov 16, 2025 - 04:38
 0  1038
ఘోర రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ మృతి

కారు బీభత్సం ఘోర రోడ్డు ప్రమాదం..

కానిస్టేబుల్ కమలాకర్ మృతి

కారును వదిలి పారిపోయిన నిందితుడు... 

పోలీసుల గాలింపు... 

నాగారం 16 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :

సూర్యాపేట జనగామ నేషనల్ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అతివేగంతో దూసుకొచ్చిన కారు పోలీసులను ఢీ కొట్టింది  ప్రమాదంలో కానిస్టేబుల్  మరియు బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకుల తో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు నిద్దరించారు వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మరణించాడు ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్ అక్కడ వదిలి పారిపోయాడు కారు నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి