ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తిరుమలగిరి 03 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా మునిసిపల్ కార్యాలయములో మునిసిపల్ కమీషనర్ బి యాదగిరి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మునిసిపల్ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక బృందాలు మరియు పురప్రముఖులతో రాలి నిర్వహించి తిరుమలగిరి పాత గ్రామ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. మునిసిపల్ కార్యాలయములో మొక్కలు నాటడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి శాగంటి అనసూయ , మాజీ కౌన్సిలర్ హనుమంతు , శ్రీ శాగంటి రాములు , సీనియర్ సహాయకులు రాజు , కార్యాలయ సిబ్బంది, పాత్రకేయులు మరియు పురప్రముఖులు పాల్గొనడం జరిగింది.