ఘనంగా జరిగిన కార్తీక మాస అమావాస్య పూజలు

Nov 20, 2025 - 15:54
 0  18
ఘనంగా జరిగిన కార్తీక మాస అమావాస్య పూజలు
ఘనంగా జరిగిన కార్తీక మాస అమావాస్య పూజలు

జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల కార్తీక మాసం అమావాస్య సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 24వ వార్డు నందు వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి వీధి ప్రజలు, ఆలయ కమిటీ సహకారంతో, విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం అభిషేకం, మహా మంగళహారతి ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు మధ్యాహ్న అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 24 వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. ఆయన మాట్లాడుతూ మన వార్డులో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి  చెందుతుందని, ఆలయ కమిటీ వారికి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు, గద్వాల ఎమ్మెల్యే  బండ్లకృష్ణమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం జరిగిందని, ఆలయ అభివృద్ధిలో ఇంకేమైనా ఆలయానికి అవసరమున్నచో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  సహకారంతో అందుబాటులో ఉంటానని ఆలయ కమిటీ వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా 22వ వార్డు మాజీ కౌన్సిలర్ భాస్కర్ యాదవ్, 31వ వార్డు మాజీ కౌన్సిలర్ రామాంజి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానిలో ఆలయ కమిటీ వారు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, తెలుగు ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి తెలుగు  దవులన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేంద్ర యాదవ్, ఆలయ కమిటీ నాయకులు లింగమయ్య గౌడ్, చిన్న భీమ్రాజ్ ,అంజి ,శేఖర్ గౌడ్, జనార్దన్ రెడ్డి, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333