ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆత్మకూర్ ఎస్.. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని గ్రామాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రెవిన్యూ కార్యాలయం లో తహసీల్దార్ హరిచంద్ర ప్రసాద్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో హేసీమ్, పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్, రైతు వేదికలో ao దివ్య , పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, పాఠశాల ల్లో ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ లలో పంచాయితి కార్యదర్షులు జెండా ఎగురేశారు. ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో 150మంది విద్యార్థులకు ప్యూషన్ ఫైనాన్స్ వారు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు.కార్యక్రమాలలో apo ఈశ్వర్,mpo రాజేష్ వెంకటాచారి, హుసేన్ , స్వామి, ప్రదీప్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.