గ్రామ ప్రజలు ఎస్బిఐ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Sep 2, 2026 - 19:36
 0  5
గ్రామ ప్రజలు ఎస్బిఐ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అడ్డగూడూరు 2 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండలంలోని చౌల్లరామారం గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ సర్వీస్ పాయింట్ (సిఎస్పి)ను ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..గ్రామ ప్రజలు నగదు జమ,నగదు ఉపసంహరణ,ఆధార్ ఆధారిత బ్యాంకింగ్,డబ్బు బదిలీ, బ్యాలెన్స్ విచారణ తదితర బ్యాంకింగ్ సేవలను గ్రామంలోనే సులభంగా పొందవచ్చని తెలిపారు.ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు,సీసీలు,గ్రామ సర్పంచ్,గ్రామ పెద్దలు, మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333