గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి

Nov 28, 2025 - 19:04
 0  23
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి

 జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను పూర్తిగా స్వేచ్ఛాయుతంగా,పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల్లో నామినేషన్ సమయంలో బెదిరింపులు, దౌర్జన్యం, లంచాలు, సర్పంచ్/వార్డు పదవులకు ఏకగ్రీవాలకు వేలం వంటి అనైతిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 171-A ప్రకారం ఎన్నికలలో అక్రమ ప్రవర్తనలు, సెక్షన్ 171-B ప్రకారం లంచగొండితనం, సెక్షన్ 171-C ప్రకారం ఓటర్లపై అనుచిత ప్రభావం లేదా బెదిరింపులు ఎన్నికల నేరాలుగా పరిగణించబడతాయని తెలిపారు. వీటికి సెక్షన్ 171-E మరియు 171-F ప్రకారం ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు, అలాగే అనైతిక చర్యలకు పాల్పడిన వారు ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. పదవులను వేలం వేయడం, లంచగొండితనం, అనుచిత ప్రభావం వంటి ఎవరైనా నామినేషన్ లేదా ఉపసంహరణ సమయంలో అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులు చేసినా, డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురిచేసిన లేదా పదవులను వేలం వేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలియజేశారు. అలాగే సంబంధిత ఎన్నికల అధికారులు ఇలాంటి చర్యలపై నిఘా ఉంచాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు భయపడకుండా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333