గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ

Dec 5, 2025 - 20:35
 0  111
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ

కాంగ్రెస్ పార్టీలో చేరిన చాగాపురం యువత

సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారీ ఎత్తున గ్రామ గ్రామాన చేరికలు .

 జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి ; అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో పరశురాముడు అనే అతనితోపాటు 40 మంది  కార్యకర్తలు ఈరోజు శాంతినగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 ఈ కార్యక్రమంలో ఇటిక్యాల మండలాధ్యక్షులు రుకుమానందరెడ్డి మరియు ఇటిక్యాల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు చాందు, లింగన్న, అల్లా బాకస్, ఆంజనేయులు, గొల్ల రామకృష్ణ, గోవర్ధన్,తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333