గ్రామాలలో సీసీ కెమెరాలు కీలకము, ఎస్సై నాగరాజు

Nov 19, 2025 - 19:09
Nov 19, 2025 - 19:32
 0  1
గ్రామాలలో సీసీ కెమెరాలు కీలకము, ఎస్సై నాగరాజు

19-11-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం :  చిన్నంబావి మండల ఎస్సై నాగరాజును మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించిన శ్రీశైల నిర్వహితులు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం : చిన్నంబావి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజ  చిన్నంబావి మండల కేంద్రంలో బుధవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై నాగరాజు మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాలు అత్యంత కీలకమని చిన్నంబావి మండల ఎస్సై నాగరాజు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలపై ఆయన గ్రామస్థులతో మాట్లాడారు.ఎస్సై నాగరాజు మాట్లాడుతూ… “గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాలను సులభంగా నియంత్రించవచ్చు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేరం జరిగినా, రికార్డుల ఆధారంగా నిందితులను వెంటనే గుర్తించడం చాలా సులభం అవుతుంది” అని తెలిపారు.ప్రతి గ్రామంలో ప్రజలు సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా, రాత్రి పూట మహిళలు, చిన్నపిల్లలు భయపడకుండా తిరగగలిగే వాతావరణం ఏర్పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.విలేజ్ సేఫ్టీ & సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రధాన రోడ్లు, రచ్చ కట్ట, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రజలు ఎక్కువగా కూడే కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఉంటే గ్రామంలో జరిగే ప్రతి సంచలనం రికార్డవుతుందని చెప్పారు. “ఒక కెమెరా వెయ్యి మంది పోలీసుల పనితీరుకు సమానం” అని ఎస్సై నాగరాజు పేర్కొన్నారు.ఇప్పటికే పలు దొంగతనాలు, దాడులు, ఇతర కేసులను సీసీ కెమెరా ఆధారంగా ట్రేస్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. “మీ ఇంట్లో ఉన్న ఆస్తి భద్రంగా ఉందన్న నమ్మకం మీరు ఉంటే… ఆ భద్రత గ్రామం→మండలం→తాలూకా→జిల్లాగా విస్తరిస్తుంది. గ్రామాలే దేశానికి వెన్నెముక” అని అన్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, రైతు కమిటీ, విద్యావంతులు, ఉద్యోగస్తులు, కార్మికులు చందా రూపంలో నిధులు సమకూర్చి ముందుకు రావాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.చిన్నంబావి మండలంలోని 17 గ్రామపంచాయతీల ప్రజలను ఈ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించాలని ఎస్సై నాగరాజు పిలుపునిచ్చారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State