గ్రామాలలో, గురుకుల, సంక్షేమ హాస్టల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి

Jul 29, 2025 - 07:36
 0  3
గ్రామాలలో, గురుకుల, సంక్షేమ హాస్టల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  గ్రామాల గ్రామాలలో, సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పి.డి.ఎస్.యు - పివైఎల్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభంలో సీజనల్ వ్యాధులు మూలంగా అనేకమంది ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు సరిపడ లేకపోవడం వలన ప్రజలకు వైద్యం అందే పరిస్థితి లేదని అన్నారు. సంక్షేమ, గురుకులా హాస్టల్లో గత కొన్ని రోజులుగా భోజనంలో నాణ్యత లోపం వలన రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ మూలంగా అనేక మంది విద్యార్థులు అనారోగ్య బారిన పడి హాస్పటల్ పాలవుతున్నారని అని కొంతమంది విద్యార్థులు చనిపోతున్నారని అన్నారు. మండల వైద్య అధికారులు వెంటనే స్పందించి మండల వ్యాప్తంగా గ్రామాలలో గురుకులలో, సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య సేవలు అందించాలని కోరారు. విద్యార్థులకు మెడికల్ కిట్లు అందించాలని కోరారు. విద్యార్థులకు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారానికి ఒక్కసారైనా డాక్టర్లు ప్రభుత్వ పాఠశాలను, గురుకులా, సంక్షేమ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రవి, పి.డి.ఎస్.యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.