గ్రామాలను మరిచిన పంచాయతీ కార్యదర్శులు

Aug 18, 2024 - 08:06
Aug 18, 2024 - 22:50
 0  7
గ్రామాలను మరిచిన పంచాయతీ కార్యదర్శులు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ గ్రామాలను మరిచిన పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు పదవీ కాలం ముగియడం తో కానరాని కార్యదర్శులు... వారానికి ఒకసారి కూడా విధులకు వెళ్ళని వైనం.. గ్రామాల్లో పెరిలుకుపోయిన సమస్యలు.. ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని గ్రామాల్లో పంచాయితి కార్యదర్షులు సక్రమంగా విధులకు రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. సర్పంచుల పదవీ కాలం పూర్తి అయిన కానుండి వారం లో ఒకటి రెండు రోజులు మాత్రమే వీధులకు వచ్చి కొద్ది సేపు మాత్రమే ఉండి వెళుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుద్యం ,త్రాగు నీరు సమస్య ల తో పాటు మరి కొన్ని సమస్యలు ఉన్నాయని అవి పరిష్కరించుటలో పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా విధులకు రాక విఫలం అవుతున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే నిధులను దేనికోసం ఖర్చు చేస్తున్నారు అనేది తెలియకుండా ఉన్నారని తెలిపారు. కొన్ని గ్రామాల్లో పని చేసే కార్యదర్శులు ఇతర గ్రామాల కు ఇన్చార్జిలు గా చేస్తుండగా అక్కడి వారికి ఇక్కడ ఉన్నట్లు ,ఇక్కడి వారికి అక్కడ ఉన్నట్లు చెప్పుకుంటూ విధులకు రాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. మండలoలో మొత్తo 30గ్రామాలకు గాను 25మంది విధులు నిర్వర్టిస్తుందగా ఇందులో ఇద్దరు కలెక్టరేట్ కు డిప్యూటేశన్ పై వెళ్ళారు. ఉన్న కార్యదర్శు లలో కొందరు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. నసీం పేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయకుండా గత కొన్ని నెలలుగా ఉంటుంది. రాత్రి వేళల్లో విందులు వినోదాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి కి రామన్న గూడెం ఇన్చార్జి ఇవ్వడం తో ఇక్కడ పనులు కుంటు పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా గ్రామాల్లో పంచాయితి కార్యదర్శులు సక్రమంగా విధులకు హాజరై గ్రామాల్లో సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. *Mpo రాజేష్ వివరణ.* 30గ్రామాలకు గాను 25 మంది పంచాయతీ కార్యదర్శులు విధుల్లో ఉన్నారని అందులో ఇద్దరు డిప్యూటేషన్ పై వెల్లగా మిగతావారు విధులలో కొనసాగుతున్నారని తెలిపారు. గ్రూప్స్ నోటిఫికేషన్ కారణంగా కొందరు సెలవుల్లో ఉండడం దీర్ఘకాల సెలవులు పెట్టడం జరిగిందని అయినా ఉన్నవారితో గ్రామాల్లో సమస్య లు పరిష్కరిస్తున్నామని తెలిపారు. విధులకు సక్రమంగా రాని పంచాయతీ కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.