తెలంగాణ కాంట్రాక్టు పశు వైద్యుల జీవితాలలో వెలుగులు రావా.

Aug 18, 2024 - 13:31
Aug 18, 2024 - 22:48
 0  404
తెలంగాణ కాంట్రాక్టు పశు వైద్యుల జీవితాలలో వెలుగులు రావా.

తెలంగాణ ప్రభుత్వం -పశుసంవర్ధక శాఖ

గడిచిన 10 సం.లు అనగా 2014 నుండి 2024 వరకు పశుసంవర్ధక శాఖ - తెలంగాణ రాష్ట్రంలో పశువైద్యులు (veterinary Assistant Surgeons) మొత్తం 10 సం॥లలో (2014- 2024) 170 మంది రెగ్యులర్ డాక్టర్స్ గా TSPSC ద్వారా నియమితులైనారు. దానితో పాటు ఇంకో 75 మంది కాంట్రాక్టు పశువైద్యులుగా మాత్రమే నియమితులయ్యారు. అదే గత పది సంవత్సరాలు (2014-2024) వరకు పక్క రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో దాదాపు 1000 మంది పశువైద్యులు నియమితులయ్యరు. గత పది సంవత్సరాల కంటే ముందు ( 2012) ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు కూడా 2002 నుండి 2012 వరకు కూడా దాదాపు 1000 మంది పశువైద్యులు (veterinary Assistant Surgeons) నియమితులయ్యారు. STATE 2002 - 2012 2014 - 2024 TELANGANA ప్రత్యేక రాష్ట్రంగా లేదు 170 ANDHRA PRADESH ప్రత్యేక రాష్ట్రంగా లేదు >1000 COMBINED ANDHRA PRADESH >1000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా లేదు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సం॥లలో (2014-2024) 170 మంది పశువైద్యులు మాత్రమే నియమితులు అవ్వడానికి గల రెండు (02)

ప్రదాన కారణాలు :-

 1. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1101 గ్రామీణ పశువైద్య కేంద్రాలు (RLU) వున్నాయి. ఈ 1101 లో కనీసం ఒక్క పశువైద్య కేంద్రం (RLU) ను కూడా ప్రాథమిక పశువైద్య కేంద్రం (Primary Veterinary Centre) గా మార్చకపోవడం (upgrade చేయకపోవడం) ఒకవేళ గ్రామీణ పశువైద్య కేంద్రాలు (RLU) లను ప్రాథమిక పశువైద్య కేంద్రాలు (Primary Veterinary Centre ) గా మార్చి ఉంటే ప్రాథమిక పశువైద్య కేంద్రాల (PVC) సంఖ్య పెరిగేది. పెరిగిన ప్రాథమిక పశువైద్య కేంద్రాలకు(PVC) అనుగుణంగా పశువైద్యుల (veterinary Assistant Surgeons) నియామకం జరిగేది.

2 పశువైద్యుల (VAS) పోస్టులు ప్రస్తుత నియామకంతో పాటు గడిచిన పది సం॥ లలో 170 పోస్టులు మాత్రమే నియామకం జరగడానికి కారణం TSPSC. ఎందుకంటే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో వున్నప్పుడు ప్రతి సంవత్సరం 'డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ( B.V.SC డిగ్రీ లో సాదించిన మార్కుల) ద్వారా నియామకాలు సకాలంలో మెడికల్ & హెల్త్ డిపార్టమెంట్ లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల మాదిరిగా జరిగేవి. అనగా Tspsc ద్వారా నియామకాలు కాలయాపన జరుగుతుంది. (గడిచిన 10 సం॥లలో 170 మంది పశువైద్యులు మాత్రమే నియమింపబడడానికి ఇది కూడా ప్రదాన కారణం)

పరిష్కారాలు : 

1 ప్రస్తుతం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు 05-03-2024 తేదీన పశుసంవర్ధక శాఖ రివ్యూ మీటింగ్ లో తీస్కున్న నిర్ణయాయనికి అనుగుణంగా కొత్త మండళాలలోని 63 కొత్త మండలాలలో ఉన్నా గ్రామీణ పశువైద్య కేంద్రాలను (RLU) ప్రాథమిక పశువైద్య కేంద్రాలుగా (PVC) మార్చడం (UPGRADE) వలన కొత్తమండలాలలో పశువైద్యుల (VAS) నియామకం & పశువైద్య సేవలు సకాలంలో అందుతాయి.

2 రాస్ట్రం లో ఉన్నా కొత్త మండలాల RLU లు కాకుండా మిగితా 1101 గ్రామీణ పశువైద్య కేంద్రాలను (RLU) ప్రాథమిక పశువైద్య కేంద్రాలుగా (PVC) మార్చడం (UPGRADE) చేయడం.

3 గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో & ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా పశువైద్యులు (veterinary Assistant Surgeons) పోస్టుల బర్తిని 'డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా బర్తి చేయడం .( మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల మాదిరిగా (MBBS డిగ్రీ లోని మార్కులను బట్టి) నియామకాలు జరపడం.

 ప్రతిఫలాలు :

1 ప్రస్తుతం తెలంగాణ రాస్ట్రం లో 1500 మందికి పైగా BVSc & AH కోర్సు చదివి ఉద్యోగం రాక ప్రైవేట్ కంపనిలలో & వివిద పౌల్ట్రీ ఫార్మ్ లలో చాలిచాలని జీతలతో జీవనం గడుపుతున్నారు. వీరి జీవితాలలో వెలుగులు నింపిన వారు అవతారు & గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి రైతు వద్ద ఉన్నా పశువులకు చికిత్సను అందించిన వారు అవతారు.

ఇట్లు

పశువైద్య పట్టబద్రులు

Dr.Bokka Anil Reddy

తెలంగాణ రాస్ట్రం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333