గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

May 15, 2026 - 18:55
 0  1
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

నిరుద్యోగులు లక్ష్యాలకు అనుగుణంగా చదవాలి. 

జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి. 

లైబ్రరీ డే లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

 జోగులాంబ గద్వాల 15 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. గ్రంథాలయంలోని పత్రికలు, పుస్తకాలను పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులు చదివి సద్వినియోగం చేసుకోవాలని, గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో శుక్రవారం లైబ్రరీ డే సందర్భంగా గద్వాలలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. లైబ్రరీలో వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు, నిరుద్యోగులకు అవసరమైన అప్డేట్ పుస్తకాలను తెప్పిస్తామన్నారు. విద్యార్థులు ఒక కమిటీగా ఏర్పడి తమకు కావాల్సిన పుస్తకాల లిస్ట్ రాసి ఇవ్వాలన్నారు. గ్రూప్స్, బ్యాంకింగ్, టీచర్, తదితర ఉద్యోగాలకు సాధన చేస్తున్న నిరుద్యోగులు పక్కా ప్రణాళికతో లక్ష్యాలకు అనుగుణంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారన్నారు. ఓకే నోటిఫికేషన్ కోసం కాకుండా నిరుద్యోగులు తాము చదివిన కోర్సులకు రిలేటెడ్ గా ఉండే ఇతర ఉద్యోగాల కోసం కూడా సాధన చేస్తే ప్రయోజనం ఉంటుందనీ సూచించారు. గ్రంథాలయ పక్కా భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని సమీపంలో ఉన్న పాత కోర్టు భవనంలోకి మార్చడానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయంను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నూతన భవన నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న నిధులేకాక ఎంపీ నిధులతో పాటు కలెక్టర్ నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు. టాయిలెట్స్, ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్స్ అప్డేట్, ఇంటర్నెట్, ఇన్వర్టర్, తదితర సమస్యలను పలువురు నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చినందున పరిష్కరిస్తామన్నారు. మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండడంతో అందుబాటులో ఉన్న నిధులతో త్వరలోనే నిర్మిస్తామన్నారు. గ్రంథాలయంకు వచ్చే పాఠకులు తప్పనిసరిగా రిజిస్టర్లో సంతకాలు పెట్టాలని, లైబ్రరీ మెంబర్షిప్ కార్డును తీసుకొని సద్వియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రంథాలయంలోని వివిధ సమస్యలపై కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ గ్రంథాలయ పరిసరాలను పరిశీలించి మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు స్కావెంజర్ ను నియమిస్తామన్నారు. సమీపంలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఈవో విజయలక్ష్మి,  లైబ్రేరియన్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333