ర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలి
సూర్యాపేట 28 జూన్2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుధాకర్ పివిసి ఎండి మీలా మహదేవ్ అన్నారు. ఆదివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ట్రస్టు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని మణి దంత వైద్యశాల విద్యానగర్ నుండి కూరగాయల మార్కెట్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోట కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంచాలని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నరికియకుండా, చెట్లను సంరక్షించుకోవాలని అన్నారు. పర్యావరణానికి హాని చేస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మానివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ సభ్యులు దేవరశెట్టి నాగరాజు, దారం శ్రీనివాస్, నెల్లుట్ల వెంకట్, తల్లాడ రామచంద్రయ్య, సోమా సురేష్, రావిర్యాల సురేందర్, సోమా హేమమాలిని, తోట అలేఖ్య, గూడూరు నాగేశ్వరరావు, గుండా కిరణ్, గుండా సతీష్ తదితరులు పాల్గొన్నారు