బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ
"ఉత్తరధృవం.. దక్షిణధృవం పాఠం నేర్పి.. ఆసక్షిగా తిలకించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు."
సర్కారు పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య - ఎస్పీ.
పూర్వపు వృత్తిని గుర్తుచేసుకుని విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ.
సూర్యపేట, 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా ఎస్పీ ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను సందర్శించి ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.. మరో మారు తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తుచేసుకొని ఉత్తరధ్రువం.. దక్షిణధ్రువం.. అంటూ సాంఘికశాస్త్రం పాఠాలను ఎనిమిదోవ తరగతి విద్యార్థులకు బోధించారు. ఎస్పీ గారు చెప్తున్న పాఠాలను విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.
జూనియర్ అసిస్టెంట్ కు సన్మానం.. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలనందే తన కుమారుడు రుత్విక్ ను చెప్పించిన జూనియర్ అసిస్టెంట్ హరితను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన అనుభవిజ్ఞులైన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని పిల్లలకు అర్థమయ్యే రీతిలో సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తారని తెలిపారు. కావున తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తెలిపారు.
విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరారు. చెడు అలవాటులకు దూరంగా ఉండాలని మంచి స్నేహితులను మంచి పుస్తకాలను ఎంచుకొని కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యంతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని సర్కారు బడుల ప్రాముఖ్యతను సామర్థ్యాన్ని తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం ఎస్పీ వెంట అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ పట్టణ సిఐ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.