చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదికారి డాక్టర్ పెండెం వెంకటరమణ
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
సూర్యాపేట 28 జూన్2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేద లక్షాది అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాత శిశు విభాగంలో వారు పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత నిర్మాణం చేయడంలో ప్రజలు సహకరించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి వార్డులో , ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాబట్టి ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ కోటి రత్నం, జిల్లా గణాంక అధికారి బాసిత్, డాక్టర్ వాసవి,మేనేజర్ నవకాంత్, లతీఫ్, ఉపేందర్ , సిబ్బంది పాల్గొన్నారు