ఏఐటియుసి జోగులాంబ గద్వాల జిల్లా మూడో మహాసభలు జయప్రదం
కార్మిక రాజ్య స్థాపనే లక్ష్యంగా కార్మికులు ఉద్యమించాలి.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ.
జోగులాంబ గద్వాల 28 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆల్ ఇండియా ట్రేడియన్ కాంగ్రెస్ ( ఏఐటియుసి) జోగులాంబ గద్వాల జిల్లా మూడో మహాసభలు గద్వాల పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. గద్వాల పట్టణంలోని జమ్మిచేడ్ జములమ్మ టెంపుల్ దగ్గర వైష్ణవి ఫంక్షన్ హాల్ కామ్రేడ్ రంగన్న అధ్యక్షతన జరిగాయి. మా ప్రారంభానికి ముందు ఏఐటియుసి పతాకాన్ని ఏఐటియుసి జాతీయ మాజీ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి ఎగరవేసి మహాసభ లను ప్రారంభించి మాట్లాడారు .ఈ మహాసభలకు కార్మికులు, వివిధ రంగాల సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.సభలో కార్మిక సమస్యల పరిష్కారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలు, రాబోయే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఎఫ్, పీఎఫ్, మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ , ఎఐటియుసి జాతీయ మాజీ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రేమ పావని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎం నరసింహ మాట్లాడుతూనేడు కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి ఏమాత్రం కార్మికులకు ఉపయోగం లేని చట్టాలను తీసుకురావడం దుర్మార్గమన్నారు. దేశంలో ఎక్కడ కూడా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలను కాలరాసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి వాటిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను బలవంతంగా బయటకి నెట్టివేయిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్రము చేయడం లేదని ఏఐటీయూసీ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి విమర్శించారు. ఆటో కార్మికులైన అమాలి కార్మికులైన రిక్షా కార్మికులైన క్యాబ్ కార్మికులైన వ్యవసాయ కార్మికులైన ప్రభుత్వాలు ఏమైనా మా కోసం ఇన్సూరెన్స్ జీవిత బీమా భద్రత సౌకర్యాలు కల్పిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారని కానీ ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పని చేయడం మా బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులు అలాగే ఆటో కార్మికులు ఇచ్చిన హామీలు అమలు కోసం ఎదురుచూస్తున్న నేటికి ప్రయోజనం చేకూర్చడం లేదని విమర్శించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ కార్మికులు పని భారం పెరిగి సరైన జీతాలు లేక ఈఎస్ఐ పీఎఫ్ లేక శ్రమ దోపిడీ గురవుతున్న ఇంకా కార్పొరేట్ ప్రైవేటు ఏజెన్సీలకు కార్మికులను వారి శ్రమను దోచుకోవడానికి అప్పనంగా అప్పజెప్పడం సిగ్గుచేటని వాళ్ల శ్రమ దోపిడిని దోచుకొని ఏజెన్సీలకు కట్టబెట్టే విధంగా నిర్ణయాలు మానుకోవడం కార్మికులకు మేలు చేస్తున్నట్లుగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంలో విలీనం తదితర అంశాలను తక్షణమే అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రేమ్ పావని మాట్లాడుతూ అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన ఏ రంగాల వారికి పెంచుతున్నారో స్పష్టత లేదని పేర్కొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన రాజీలేని పోరాటాలకు శ్రీకారం చుట్టాలని ఆ దిశగా కార్మిక సంఘం సభ్యత్వం కమిటీలు, కార్యక్రమాలు రూపొందించాలని దానికి ఏఐటీయూసీ రాష్ట్ర కేంద్రం సంపూర్ణంగా సహకారం ఉంటుందని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రేమ్ పావని గారు తెలిపారు. ఏ మాసభలో జిల్లా అధ్యక్షులు జిల్లా నిర్మాణం భవిష్యత్తు కర్తవ్యాలు నాయకత్వం పని విధానం తదితర అంశాలపై మాట్లాడారు అనంత ఈ జిల్లాకు సంబంధించిన కార్మిక సమస్యల పైన కొన్ని తీర్మానాలు చేసి ఆమోదం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు ప్రతినిధులు రంగన్న వెంకటేష్ కాసిం కృష్ణ నారాయణ రాజు నాగరాజు పరశురాము వెంకటేశు మద్దిలేటి నాగార్జున ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ అధ్యక్షులు భరత్ ఆశన్న కురుమన్న బంగారు తిమ్మప్ప రవి వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.