సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం 

Jun 29, 2026 - 19:30
 0  1
సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యం 

పేదలకు మరిన్ని సేవలు అందించాలి

ఘనంగా లయన్స్ కంటి ఆసుపత్రి నూతన భవన పూజ కార్యక్రమం

రాచర్ల లక్ష్మీ కాంతారావు మెమోరియల్ లయన్స్ విజన్ ఐ కేర్ ప్రారంభం 

సూర్యాపేట టౌన్ :  నిరుపేదలకు సహాయాన్ని అందించేందుకు లయన్స్ క్లబ్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి ఆవరణలో రూ. 75లక్షలతో నిర్మించిన నూతన భవన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాచర్ల లక్ష్మీకాంతారావు మెమోరియల్ లయన్స్ విజన్ ఐ కేర్ సెంటర్ ను కూడా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక సేవే లయన్స్ క్లబ్ లక్ష్యమని అన్నారు. వివిధ లయన్స్ క్లబ్బుల ద్వారా పేదల కొరకు మాన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే లయన్స్ క్లబ్ లకు మరింతగా మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి ద్వారా రికార్డు స్థాయిలో ఓపీలు చూడటం, సర్జరీలు చేయడం గర్వకారణమని ప్రశంసించారు.2025-26 సంవత్సరంలో 37518 ఓపీలు, 2384 మందికి కంటి ఆపరేషన్ నిర్వహించటం పట్ల అభినందించారు. మరిన్ని వైద్య సదుపాయాలను కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. అనంతరం ఈ వేడుకలకు హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు.నామవరం గ్రామం నుంచి వచ్చిన 30 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ దోసపాటి గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వుప్పల రాజేంద్రప్రసాద్, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మీలా మహదేవ్, సెక్రటరీ రాచర్ల కమలాకర్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 గుడిపూడి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు మిర్యాల సుధాకర్,కొండా సంతోష్, ట్రస్ట్ బోర్డు సభ్యులు బండారు రాజా, మొరిశెట్టి లక్షాది, కక్కిరేణి చంద్రశేఖర్,చల్లా లక్ష్మీకాంత్, ఈగ దయాకర్,రాచకొండ శ్రీనివాస్, యామా ప్రభాకర్, డాక్టర్ శ్రీవాణి,డాక్టర్ నితీష్, మేనేజర్ మల్లిఖార్జున్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333