ఉద్యాన పంటల సాగుకు రాయితీలు

Jun 29, 2026 - 19:29
Jun 29, 2026 - 19:29
 0  1
ఉద్యాన పంటల సాగుకు రాయితీలు
ఉద్యాన పంటల సాగుకు రాయితీలు

2026-27లో సూర్యాపేట జిల్లాకు రూ.12.36 కోట్ల ప్రణాళికలు

ఉద్యాన పంటల సాగుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి

రాయితీలు పొందాలంటే ఉద్యాన అధికారులను సంప్రదించండి

జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య

సూర్యాపేట జూన్ 29 : పండ్లు, కూరగాయలు, పూలు వంటి అధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో రాయితీలు అందిస్తున్నాయి. తాజా గా 2026-27 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వార్షిక ప్రణాళికల కింద సూర్యాపేట జిల్లాకు రూ.12.36 కోట్ల మేర నిధులు కేటాయించబడ్డాయి. ఈ ప్రణాళికలలో ఆయిల్ పామ్ సాగు, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, వెదురు మిషన్ వంటి పథకాలు ఉన్నాయి. జిల్లా రైతులు ఈ పథకాల ప్రయోజనాన్ని వినియోగించుకోవాలంటే అవసరమైన మౌలిక వసతులు కలిగి ఉండాలి. భూమి, నీరు, విద్యుత్ వసతి కలిగిన రైతులు ఆయా డివిజన్ ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయిల్ పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం..

వరి వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించబడ్డాయి. గత  నాలుగు సంవత్సరాల లో 5751 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించబడగా, 2026-27లో మరో  1000 ఎకరాలకు భౌతిక లక్ష్యంగా పెట్టారు. జిల్లాలో ఈ సాగుకు తెలంగాణా ఆయిల్ ఫెడ్ ను కార్యనిర్వాహక ఏజెన్సీగా నియమించారు. ప్రస్తుతం టన్ను ధర రూ. 23 800/-ఉండగా, ఎకరాకు సగటున 8-10 టన్నుల దిగుబడి లభిస్తుంది. దాంతో పాటు, ఎకరానికి రూ. 2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ పామ్ మొక్కల నాటడం, తోటల నిర్వహణ, అంతర పంటలకు ప్రభుత్వ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. బిందు సేద్యానికి గరిష్టంగా 12.5 ఎకరాల వరకు రైతులకు నాలుగేళ్లలో రూ.50,918 రాయితీ లభిస్తుంది. ఇందుకు గాను 5.09 కోట్ల కేటాయించారు.

సూక్ష్మ నీటి పారుదల పథకం

బిందు .స్ప్రింక్లర్ సేద్య పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని సమర్థంగా చేయడం ఈ పథక ఉద్దేశ్యం. ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల ద్వారా రైతుల క్షేత్రాల్లో వ్యవసాయ పరికరాలను అమర్చనున్నారు.

బిందు సేద్యం %% 2684 ఎకరాలు (రూ.547.09 లక్షలు), గరిష్ట పరిమితి 12.5  ఎకరాలు ఉండగా రాయితీ శాతం: ఎస్సి, ఎస్టీ రైతులకు 90శాతం,బిసి/చిన్న రైతులకు 80 శాతం, ఇతరులకు 70 శాతం చొప్పున రాయుతి లభిస్తుంది.

వెదురు మిషన్ గట్ల వెంబడి వెదురు మొక్కలు నాటి అదనపు ఆదాయం పొందేందుకు 50శాతం రాయితీ అందించనున్నారు. మొక్కలకూ రెండేళ్ల పాటు సబ్సిడీ లభిస్తుంది (మొదటి సంవత్సరం రూ. 90, రెండవ సంవత్సరం రూ.60). మొత్తం  30 ఎకరాలకు గాను రూ.4.32  లక్షలు కేటాయించారు.

సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం

ఈ పథకం కింద కొత్త తోటల స్థాపన, నాణ్యమైన కూరగాయల నారు పంపిణీ, పూల తోటల పెంపకం, పాత తోటల పునరుద్ధరణ, నీటి కుంటల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ఈ పథకం ద్వారా రైతులు పళ్ళ తోటలు, కూరగాయలు, పూలు సాగు చేసుకోవడానికి 40-50% సబ్సిడీ పొందవచ్చు. పాత తోటలను పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఈ ఏడాది రూ.160.06 లక్షల కేటాయింపు ఉంది.

ఈ పథకం ద్వారా రైతులు పళ్ళ తోటలు, కూరగాయలు, పూలు సాగు చేసుకోవడానికి 40-50% సబ్సిడీ పొందవచ్చు. పాత తోటలను పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఈ ఏడాది రూ.160.06 లక్షల కేటాయింపు ఉంది.

ఏ రైతుకు ఏ సహాయం అందుతుందంటే:

పళ్ళ తోటలు (మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, పనస, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో తదితరాలు): 32 హెక్టార్లు లక్ష్యం - రూ. 17.40 లక్షలు

హైబ్రిడ్ కూరగాయలు, ఉల్లిపాయ సాగు: 52 హెక్టార్లు రూ.12.48 లక్షలు

పూల సాగు (లూజ్ ఫ్లవర్స్): 10.41 హెక్టార్లు రూ.2.08 లక్షలు

పాత తోటల పునరుజ్జీవనం (Rejuvenation): 62 హెక్టార్లు రూ.14.88 లక్షలు

ఫారమ్ పాండ్స్ (నీటి నిల్వ): 4 నిర్మాణాలు రూ. 3.60 లక్షలు

ప్లాస్టిక్ మల్చింగ్ / షేడ్ నెట్ హౌస్: 40 హెక్టార్లు- రూ.8.00 లక్షలు

యంత్రీకరణ (ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు): 31 యూనిట్లు రూ. 14.42 లక్షలు

పాక్ హౌస్ (పంట తర్వాత నిల్వ, పంపిణి 5 యూనిట్ల 12 లక్షలు 
 మొత్తం రూ.160.06 లక్షల నిధులు కేటాయించబడ్డాయి. 

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన

తీగ జాతి కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు ఈ పథకం రూపొందించబడింది. ఒక్క యూనిట్ కు రూ. 50,000 రాయితీ లభిస్తుంది. ఒక్క రైతుకు గరిష్టంగా ఐదు యూనిట్ల వరకు అనుమతించనున్నారు. మొత్తం 30 యూనిట్లకు  రూ.15 లక్షలు మంజూరు అయ్యాయి.

దరఖాస్తు ప్రక్రియ..

ఈ పథకాల ప్రయోజనాలు పొందాలనుకునే రైతులు తాము నివసిస్తున్న డివిజన్ ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు క్రింద పేర్కొన్న నంబర్లలో సంప్రదించ వచ్చు. సూర్యాపేట డివిజన్: స్వాతి 8977714168, హుజూర్నగర్ డివిజన్: ప్రదీప్తి 8977714170, తుంగతుర్తి డివిజన్ ప్రమిత 8977714169, కోదాడ డివిజన్: అనిత 8977714171 లను గాని ఆయా మండలాల ఉద్యాన విస్తరణ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

రైతులు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య

పండ్లు, కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలు అధిక ఆదాయాన్ని అందించే వ్యవసాయ శాఖ అని, ఈ పంటల సాగుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక రాయితీలతో ప్రోత్సహిస్తున్నాయి. 2026-27 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ.1236 లక్షల ప్రణాళికలు మంజూరయ్యాయి. ఆయిల్ పామ్, పండ్లు, పూలు, బిందుస్ప్రింక్లర్ మెతుకులు, వెదురు మొక్కలపై పలు రాయితీలు, మౌలిక వసతుల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత డివిజన్ అధికారులు రైతులకు సహకరిస్తున్నారని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333