పరుగుల రాణి ఉమకు ఆర్ధిక సాయం

Jun 29, 2026 - 00:05
Jun 29, 2026 - 00:32
 0  2
పరుగుల రాణి ఉమకు ఆర్ధిక సాయం

అక్షర ఫౌండేషన్, ఎస్ కే ఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట ఆధ్వర్యంలో 20 వేల రూపాయల చెక్కు అందజేత

సూర్యాపేట  28 జూన్2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడంలో అక్షర ఫౌండేషన్ ముందు ఉంటుందని ఎస్ కే ఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంకినేని కృష్ణారావు ప్రశంసించారు. సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామానికి చెందిన మరిపల్లి ఉమ పరుగు పందెంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం, అంతర్జాతీయ స్థాయిలో 15 వ ర్యాంకు సాధించిన సందర్భంగా అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకినేని కృష్ణారావు గారి సహకారంతో ఆదివారం సంస్థ కార్యాలయంలో 20,000/- చెక్కు అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమను ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి మాతృభూమికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతనకల్ కు చెందిన, మట్టిలో మాణిక్యమైన ఉమ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులు హనుమంతరావును అభినందించారు. త్వరలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు వైకుంఠ ధామ వాహనాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి, అక్షర అధ్యక్షులు ఉప్పు నాగయ్య, రిటైర్డ్ పీడీ హనుమంతరావు, సొల్లేటి ఉపేంద్రాచారి, ఎలగందుల సుభాష్ చంద్రబోస్, పాల్వాయి వెంకన్న, జటంగి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333