ప్రజావాణి దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం

Jun 29, 2026 - 19:47
 0  0
ప్రజావాణి దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం

ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వానాకాలం వన మహోత్సవమునకు శాఖల వారీగా టార్గెట్స్ పూర్తి చేయాలని ప్రతి శాఖల అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రత్యేక దృష్టితో  శాఖల వారీగా అధికారులు పూర్తిచేయాలని , ప్రజా పాలన - కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వాడకం పై అవగాహన కల్పించడంలో మహిళా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ బాగా కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని,  ప్రతి కాలేజీ, స్కూళ్లలో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే రోడ్డు భద్రత గురించి సంక్షేమ హాస్టల్స్ లో, కాలేజీ, పాఠశాలలో అవగాహన సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు రోడ్డు భద్రతపై సూచనలు చేయాలని, ఎన్ హెచ్ 65, కూడ కూడ రోడ్డులో అక్కడక్కడ రోడ్డు పాడైపోయి ఎక్కువ ఫిర్యాదులు  వస్తున్నందువలన   ఎన్ హెచ్ -65 అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ సిబ్బంది సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని అన్నారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు. 
       సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 53 దరఖాస్తులు,  డిడబ్ల్యుఓ 9, డిఇఓ 5,  డీపీఓ 3,  మిగిలిన 28  దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
     ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డి ఆర్ ఓ ప్రేమ్ రాజు, డిఆర్డిఓ  పి డి సన్యాసయ, జడ్పీ సీఈఓ శిరీష,  డిఎంహెచ్ఓ వెంకటరమణ, పిడి హౌసింగ్ సిద్ధార్థ్, సిపిఓ కిషన్ నాయక్,డిఇఓ అశోక్ , సి పి ఓ కిషన్ నాయక్ ఇతర జిల్లా అధికారులు తదితరులు హాజరైనారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333