ప్రయివేట్ విద్యా సంస్థలకు కొమ్మకాస్తున్న deo ను సస్పెండ్ చేయాలి 

Jun 29, 2026 - 19:46
 0  4
ప్రయివేట్ విద్యా సంస్థలకు కొమ్మకాస్తున్న deo ను సస్పెండ్ చేయాలి 

 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో deo దిస్టిబొమ్మ దగ్ధం 

 సూర్యాపేట ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు సూర్యాపేట deo కొమ్ముకాస్తున్నారని, వారు నిబంధనలను అతిక్రమించిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే deo ను సస్పెండ్ చేయాలనీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం 60 అడుగుల రోడ్డులో deo దిష్టి బొమ్మ ను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైననాటి నుండి ప్రయివేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను, కోర్ట్ ఉత్తర్వులను దిక్కరిస్తూ లక్షల రూపాయల ఫీజ్ లు అక్రమంగావాసులు చేస్తున్నారన్నారు. జీవో 1 మరియు 91 కు విరుద్ధంగా పాఠశాల లోనే దుకాణా లు తెరిచి పాఠ్య పుస్తకాలు, షూ, బెల్ట్ బ్యాగ్ తథితర వస్తువులను అధిక రేట్ల కు విక్రయిస్తున్నారన్నారు. పాఠశాల ల దందా నడుస్తున్న ఏ ఒక్క రోజు కూడా విద్యా శాఖ అధికారి పాఠశాల ల ను సందర్శించి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యార్థి సంఘ నాయకులు మరియు మీడియా ద్వారా  deo దృష్టికి  తీసుకెళ్లిన ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. ఐదు సంవత్సరాలుగా డీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ ప్రైవేట్ కార్పొరేటర్ విద్యా సంస్థలకు  వత్తాసు పలుకుతూ వారు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యా రంగం పై కనీస దృష్టి deo కు లేదన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ విద్యా రంగం నిర్లక్ష్యానికి గురైందని , ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిందన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని త్రివేణి పాఠశాల అక్రమాలను బట్ట బయలు చేసినప్పటికీ  ఆ పాఠశాలపై చర్యలు తీసుకోపోవటం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు.  డీఈవో పనితీరుపై పై అధికారులు విచారణ జరిపి  డీఈవోను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డీఈఓ పనితీరుపై  కలెక్టర్,మరియు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రవేటు విద్యాసంస్థలల్లో జరుగుతున్న అక్రమాలపై , డీఈఓ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా  పోరాటాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.


 ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘం నాయకులు  ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పిడమర్తి భరత్, తగుల్ల జనార్దన్,  ఎర్ర అఖిల్, సింహాద్రి,కుమార్ పోలోజు మహేష్, సాయి తేజ, పులుసు శ్రవణ్, నారాయణ రెడ్డి,ప్రవీణ్, నవీన్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333